Sonam Raghuvanshi | సోనమ్ రఘువంశీబెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ (రాజారఘువంశీ హత్య) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది.
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ (రాజారఘువంశీ హత్య) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ కేసు విచారణ ఆలస్యమైతే ఆరు నెలల తర్వాత కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. గతేడాది వివాహ తర్వాత రాజా రఘువంశీ, అతడి భార్య సోనమ్ రఘువంశీ మేఘాలయలోని షిల్లాంగ్‌కు హనీమూన్‌కు వెళ్లారు.
మే 21, 2025న హనీమూన్‌కు వెళ్లగా, అదే నెల 26న ఇద్దరూ కనిపించకుండా పోయారు. జూన్ 2న ఒక లోయవద్ద రాజా రఘువంశీ మృతదేహం లభించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరపగా.. భార్య సోనమ్ రఘువంశీయే హత్య చేయించినట్లు తేలింది. ఆకాష్ సింగ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు రాజాను హత్య చేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పలువురికి బెయిల్ లభించింది. అందులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీకి ఈ ఏడాది ఏప్రిల్ 28న బెయిల్ లభించింది.
షిల్లాంగ్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా, ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరాలే ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు సోనమ్‌కు ఇటీవల రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి తనకుతానుగా లొంగిపోవడం, రెండోది కోర్టు బెయిల్ రద్దు చేయడం. ఈ ఆదేశాలపై సోనమ్ తరఫు లాయర్ల వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సోనమ్ తనకుతానుగా లొంగిపోయిందని చార్జ్‌షీట్‌లో ఉందని ప్రభుత్వం తరఫు లాయర్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
ఒకవేళ ఇంకా బెయిల్ కొనసాగితే సోనమ్ కనిపించకుండా పోయే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ సోనమ్ బెయిల్ రద్దు చేసింది. మూడువారాల్లోగా విచారణ అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి కాకపోతే తిరిగి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

