చెన్నై: బీహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తప్పులు, నిర్లక్ష్యపూరిత చర్యలను చెరిపేయలేవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ ఫలితాల నుంచి ఇండియా కూటమి నేర్చుకోవలసినది చాలా ఉందన్నారు. ఆయన శనివారం కఠిన పదజాలంతో ఓ ప్రకటనను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈసీ విశ్వసనీయత మునుపెన్నడూ లేనంత స్థాయిలో దిగజారిందన్నారు. ప్రజాస్వామిక జవాబుదారీతనంపై నిశిత పరిశీలన జరుగుతున్న సమయంలో, ఈసీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోకూడదని చెప్పారు.