MK Stalin | హత్యకు గురైన బీఎస్పీ నేత కుటుంబాన్ని పరామర్శించిన సీఎం స్టాలిన్
MK Stalin | తమిళనాడు (Tamil Nadu)లో హత్యకు గురైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు (BSP chief) కె ఆర్మ్‌స్ట్రాంగ్ (K Armstrong) కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) పరామర్శించారు.
MK Stalin | తమిళనాడు (Tamil Nadu)లో హత్యకు గురైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు (BSP chief) కె ఆర్మ్‌స్ట్రాంగ్ (K Armstrong) కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి వెళ్లిన స్టాలిన్.. ఆయన చిత్ర పటం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
#WATCH | Chennai: Tamil Nadu CM MK Stalin visited the house of former BSP State President K Armstrong and met his family.
Source: DIPR pic.twitter.com/Zwvd6HAdEE
— ANI (@ANI) July 9, 2024
ఆర్మ్‌స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటికి సమీపంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి ఆయనను హత్య చేశారు. ఆదివారం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి చెన్నైకి వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యతో దళిత నేతలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.
ఈ హత్య కేసును తమిళనాడు సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ఘటనకు బాధ్యుడిగా చెన్నై సీపీ సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేసింది. పోలీస్ ట్రెయినింగ్ కాలేజీ డీజీపీగా ఆయనను నియమించింది. అడిషనల్ సీపీగా ఉన్న ఎ అరుణ్‌ను చెన్నై నగర కొత్త కమిషనర్‌గా నియమించింది.
#WATCH | Chennai: Tamil Nadu CM MK Stalin leaves after meeting the family of former state President of BSP, K Armstrong.
K Armstrong was murdered last week by a group of men in Chennai’s Perambur. pic.twitter.com/NlP6jeWycp
— ANI (@ANI) July 9, 2024
Also Read..
Usha Uthup | ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఆమె భర్త కన్నుమూత
PM Modi | గోల్ఫ్ కార్ట్‌లో మోదీ – పుతిన్ షికారు.. వీడియో వైరల్
Virat Kohli | కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

