PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రష్యా పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నిన్న ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. రష్యాలో ల్యాండ్ అయిన మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇక మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. మోదీకి పుతిన్ తన అధికారిక నివాసాన్ని (Moscow residence) దగ్గరుండి మరీ చూపించారు. గోల్ఫ్‌కార్ట్ (golf cart) (గోల్ఫ్కారు)లో షికారు చేస్తూ ఇంటి ప్రాంగణంలో కలియ తిరిగారు. మోదీని పక్కనే కూర్చోబెట్టుకుని గోల్ఫ్ కారును పుతిన్ స్వయంగా నడపడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
President Putin driving PM Modi around his residence in a golf cart.
Next level camaraderie! pic.twitter.com/Px5BAsTi5Y
— The Poll Lady (@ThePollLady) July 8, 2024
రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి..
భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి (PM Modi) ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు సమాచారం.
కాగా, ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం తర్వాత మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా వెళ్లిన మోదీ.. 22వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 10వ తేదీ ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also Read..
Usha Uthup | ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఆమె భర్త కన్నుమూత
Virat Kohli | కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Mumbai Rains | ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు