Mumbai Rains | ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు
Mumbai Rains | దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు (Mumbai Rains) ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. అయితే, మంగళవారం కూడా ముంబై నగరంలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
Mumbai Rains | దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు (Mumbai Rains) ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. అయితే, మంగళవారం కూడా ముంబై నగరంలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు (Schools Shut). అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.
కాగా, ముంబైని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కేవలం ఏడు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్లు నీటపై తేలాడాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ వర్షం రైలు, విమాన సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలను కూడా మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు భారీ వర్షాలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 72 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.
Also Read..
Vladimir Putin | రష్యా సైన్యంలో భారతీయులు.. విడుదల చేసేందుకు ఒప్పుకున్న పుతిన్!
MP K Sudhakar | మందు పార్టీతో ఓటర్లకు కృతజ్ఞతలు.. దావత్లో మనిషికో సీసా పంపిణీ చేసిన బీజేపీ ఎంపీ
Karnataka | కరువు, అప్పులే ఉరి తాళ్లు.. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు కష్ట కాలం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

