Vladimir Putin | రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి.. విడుదల చేసేందుకు పుతిన్ నిర్ణయం
భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు.
మాస్కో: భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. . ఈమేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి (PM Modi) ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు.
ఈ క్రమంలో రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికిగాను వారిని విడుదల చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారని అధికారిక వర్గాల సమాచారం. అదేవిధంగా మూడోసారి విజయం సాధించినందుకు మోదీని అభినందించారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు.
కాగా, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్ నుంచి తీసుకెళ్లిన యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకున్నది. ఈ క్రమంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. తమను మోసం చేసి సైన్యంలో చేర్చారని సుమారు రెండు డజన్ల మంది ఆరోపిస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని గతకొంత కాలంగా వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. పుతిన్‌తో విందు సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

