Usha Uthup | ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఆమె భర్త కన్నుమూత
Usha Uthup | ప్రముఖ గాయని ఉషా ఉతుప్ (Usha Uthup) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్ (Jani Chacko Uthup) ప్రాణాలు కోల్పోయారు.
Usha Uthup | ప్రముఖ గాయని ఉషా ఉతుప్ (Usha Uthup) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్ (Jani Chacko Uthup) ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి కోల్‌కతాలోని నివాసంలో గుండెపోటుతో (heart attack) తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 78.
వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి సమయంలో టీవీ చూస్తోన్న జానీ చాకో ఉతుప్ ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మరణంతో ఉషా ఉతుప్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. మంగళవారం జానీ చాకో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఉషా ఉతుప్ – జానీ చాకో దంపతులకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు.
ఇక ఉషా ఉతుప్ విషయానికి వస్తే.. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టు, నుదుటన పెద్ద సైజులో తిలకం, చేతి నిండా గాజులతో కనిపించే ఆమె ఎలాంటి పాటనైనా తనదైన స్టైల్లో పాడి అలరిస్తుంటారు. బాలీవుడ్లో ఆమె పాడిన.. ‘హరి ఓం హరి’, ‘రంబా హో’, ‘డిస్కో డాన్సర్’, ‘దోస్టన్ సే ప్యార్ కియా’, ‘వన్ టూ చా చా చా’ వంటి ఎన్నో పాటలు దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఉషా ఉతుప్ తన కెరీర్లో బెంగాలీ, హిందీ, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా మొత్తం 16 భాషల్లో పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సంగీత ప్రపంచంలో ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2011లో భారత నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో, 2024లో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది.
Also Read..
Virat Kohli | కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Shankar | ఏంటీ ఇండియన్ 2లో కమల్ హాసన్ తక్కువ టైమే కనిపిస్తాడా..? శంకర్ క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

