Ponnam Prabhakar | గుడికొస్తే కనీసం పట్టించుకోరా?.. అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్.. గుడిబయటే కూర్చుని నిరసన!
Ponnam Prabhakar | హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్చుండిపోయారు.
Ponnam Prabhakar | హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్చుండిపోయారు. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై సీరియస్ అయ్యారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు.
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.
బ్రేకింగ్ న్యూస్
అలిగి టెంపుల్ బయటే కూర్చున్న మంత్రి పొన్నం, మేయర్.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకు ప్రోటోకాల్ పాటిచడం లేదని అలక. pic.twitter.com/65cz72bxjf
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

