Shankar | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంపౌండ్ నుంచి వచ్చిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంచైజీ మూవీ ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం జులై 12న తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలవుతుంది. తెలుగులో భారతీయుడు 2గా వస్తుండగా.. శంకర్ టీం తెలుగు ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న కమల్ హాసన్ ఇందులో తక్కువ సమయమే కనిపించబోతున్నాడంటూ పుకార్లు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా వీటిపై ప్రమోషనల్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు శంకర్. కమల్ హాసన్ సార్ స్క్రీన్ టైం ఫుల్‌గా ఉంటుంది. ఆయన స్క్రీన్‌పై కనిపించకున్నా సినిమాలోని ఇతర పాత్రలు ఆయన గురించి మాట్లాడతాయి. ఇది ఉలగనాయగన్ సినిమా అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు శంకర్. అవినీతి, లంచం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో సాగే ఈ చిత్రం ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోందని తెలిసిందే.
ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?