Maharashtra | ముంబై, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అప్పు తీర్చేందుకు తమ కిడ్నీలు తీసుకోవాలంటూ ఓ రైతు తన కుటుంబంతో కలిసి వినూత్న నిరసనకు దిగారు.
రుణమాఫీ చేస్తామంటూ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి, ఇప్పుడు చేతులెత్తేయడంతో వాశింలోని అదోలికి చెందిన సతీష్ ఇధోలే అనే రైతు తనతోపాటు తన భార్య, పిల్లల కిడ్నీలు విక్రయించడానికి సిద్ధమయ్యారు. గురువారం వాశిం ప్రధాన మారెట్లో తన అవయవాల ధరలతో ఉన్న ఒక సైన్ బోర్డు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు.