Bomb Threat | తాజ్ గ్రూప్‌కు చెందిన ప్రముఖ హోటల్‌కు బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ (Taj West End) హోటల్‌కు శనివారం తెల్లవారుజామున బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లకు ఆతిథ్యం ఇచ్చే ఈ ఫైవ్‌స్టార్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు బాంబ్ స్వ్కాడ్ (bomb squad), డాగ్ స్వ్కాడ్ సాయంతో హోటల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు సెంట్రల్ బెంగళూరు డీసీపీ శేఖర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ఈమెయిల్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Bengaluru, Karnataka | Taj West End Hotel in Bengaluru received a bomb threat reportedly through an email from unknown miscreants. The hotel, known for hosting prominent politicians and cricketers, received the threat earlier today. Local police and the bomb squad have rushed to…
— ANI (@ANI) September 28, 2024
Also Read..
Massive fire | టాటా ఐఫోన్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Kulgam | కుల్గాంలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఆర్మీ జవాన్లకు గాయాలు
IIFA Utsavam 2024 | ఐఫా ఉత్సవాల్లో సందడి చేసిన తారలు.. ఫొటోలు వైరల్