Massive fire | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం (Massive fire) సంభవించింది. టాటా కంపెనీకి చెందిన ఐఫోన్ ప్లాంట్ (Tatas iPhone plant)లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. కృష్ణగిరి (Krishnagiri) జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దానపల్లిలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్‌లోని రసాయన గోదాములో ఉదయం 5:30 గంటలకు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఏడు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ కంపెనీలో టీఈపీఎల్ సంస్థ ఐఫోన్లలో వాడే వివిధ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తోంది. సుమారు 4,500 మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫస్ట్ షిఫ్ట్‌లో 1,500 మంది ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గోదాము నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
🚨 ટાટા ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગી!! #TamilNadu pic.twitter.com/8z5vMjaABe
— Sagar Patoliya (@kathiyawadiii) September 28, 2024
तमिलनाडु की कृष्णागिरी जिले में होसुर के इलेक्ट्रॉनिक प्लांट में भीषण आग लगी।
भगवान से यही प्रार्थना है की सभी लोग सुरक्षित हों।#FireAccident #होसुर
#tamilnadu pic.twitter.com/AWnfBoZcGU— jaypal chordia (@jpchordiya_5) September 28, 2024
Also Read..
Kulgam | కుల్గాంలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఆర్మీ జవాన్లకు గాయాలు
Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు
IIFA Utsavam 2024 | ఐఫా ఉత్సవాల్లో సందడి చేసిన తారలు.. ఫొటోలు వైరల్