Kulgam | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో మరోసారి ఎదురుకాల్పులు (gunfight) చోటు చేసుకున్నాయి. కుల్గాం (Kulgam) జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి.
కుల్గాం జిల్లాలోని అదిగమ్ గ్రామంలో ఉగ్రవాదులు (terrorists) నక్కి ఉన్నారన్న ముందస్తు సమాచారంతో భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల కోసం ప్రతి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గరు ఆర్మీ జవాన్లు, ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అధికారులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది.
#WATCH | Kulgam, J&K: Based on specific intelligence input, a Joint Operation was launched by the Indian Army & Jammu and Kashmir today at Arigam, Kulgam. During the search terrorists fired indiscriminately and a firefight ensued. Operation is in progress.
(Visuals deferred by… pic.twitter.com/SSVy8C7mth
— ANI (@ANI) September 28, 2024
మరోవైపు ఇవాళ జమ్మూ కశ్మీర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. మూడో విడత పోలింగ్ నేపథ్యంలో శనివారం జమ్మూలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్ఏ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికలు సెప్టెంబర్ 18 జరగ్గా, రెండో విడత సెప్టెంబర్ 25న జరిగాయి. ఇక తుది విడత ఎన్నికలు అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అదే నెల 8వ తేదీన జమ్మూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Droupadi Murmu | హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
IIFA Utsavam 2024 | ఐఫా ఉత్సవాల్లో సందడి చేసిన తారలు.. ఫొటోలు వైరల్
Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు