Swati Maliwal : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఓడిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పై రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు హాని తలపెట్టిన వారిని భగవంతుడు శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. గత ఏడాది అర్వింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) నివాసంలో ఆయన పీఏ బిబవ్ కుమార్ (Bibav Kumar) తనపై దాడికి పాల్పడిన ఘటనను ఉద్దేశించి స్వాతి మాలివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మనం చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఏ మహిళకైనా ఏదైనా అన్యాయం జరిగితే దేవుడు అందుకు బాధ్యులైన వారిని తప్పక శిక్షిస్తాడు.’ అని స్వాతి మాలివాల్ ఆప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్‌పై కూడా స్వాతి మాలివాల్ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రావణుడి గర్వం అణిగింది. ఇప్పుడాయన కేవలం కేజ్రీవాల్ మాత్రమే.’ అని తీవ్ర వ్యాఖ్య చేశారు. అహం, గర్వం ఎక్కువ కాలం పనిచేయవని అన్నారు.
జల, వాయు కాలుష్యాలతో ప్రస్తుతం ఢిల్లీ పూర్తిగా చెత్తకుండిలా మారిపోయిందని, అభివృద్ధిలో వైఫల్యం ద్వారా కేజ్రీవాల్ తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నాడని స్వాతి మాలివాల్ విమర్శించారు. కేజ్రివాల్ సర్కారు మాటలు చెప్పడమే తప్ప చేతలు చేయకపోవడంతో ప్రజలు ఓడించారని అన్నారు.
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి