IndiGo flight bird hit | ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. అహ్మదాబాద్‌కు మళ్లింపు
IndiGo flight bird hit | విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అహ్మదాబాద్: ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది (IndiGo flight bird hit). దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E-646 విమానం ఆదివారం సూరత్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే సూరత్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆ విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ విషయాన్ని నిర్ధారించింది. సూరత్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించింది.
కాగా, గత వారం ఢిల్లీ నుంచి ఒడిశాలోని డియోగర్కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ ఫేక్ అని తేలింది.
మరోవైపు ఇండిగో, గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 50 విమానాలు గ్రౌండ్ అయ్యాయి. విమానాల ఇంజిన్లు, పరికరాల సరఫరా, హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్ అప్డేట్కు సంబంధించిన అంతరాయం వల్ల భారత్ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన పలు విమానాలు నిలిచిపోయినట్లు అమెరికాకు చెందిన ఏరోస్పేస్ తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ (పీ అండ్ డబ్ల్యూ) ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

