న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది నవంబర్ 2న ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. 2018 జనవరి 2న కేంద్రం ఈ పథకాన్ని నోటిఫై చేసింది.