Supreme Court | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ కీలక సమయంలో దేశంలోని పౌరులంతా ఐకమత్యంగా ఉగ్రవాదంపై పోరాడాలని హితవు పలికింది. ఇటువంటి పిల్‌ను దాఖలు చేయడం ద్వారా మన భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? అని నిలదీసింది. న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఇటువంటి అంశాలను తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఈ పిల్‌ను ఉపసంహరించుకోవడం మంచిదని సలహా ఇచ్చింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారని.. దర్యాప్తు చేయడంలో వారు నిష్ణాతులు కాదని ధర్మాసనం చెప్పింది. ఆత్మస్థైర్యాన్ని