న్యూఢిల్లీ: రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అవినీతి ఆరోపణలపై ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం కొట్టివేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే వారు పనిచేస్తున్న ప్రదేశంతో సంబంధం లేకుండా వారిపై పీసీ చట్టాన్ని ప్రయోగించవచ్చని తెలిపింది.