న్యూఢిల్లీ: ప్రచార సభల్లో విద్వేష ప్రసంగాలు చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీని ఎన్నికల నుంచి నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. మోదీని ఆరేండ్లపాటు ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలని ఈసీని ఆదేశించాలని కోరుతూ ఫాతిమా అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఫిర్యాదును పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది. ‘మాండమస్ రిట్ కోసం మీరు ముందుగా అధికారులను సంప్రదించాలి’ అని ధర్మాసనం పేర్కొన్నది.