న్యూఢిల్లీ, మే 28: వైద్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్‌ను వారం పాటు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను ఎప్పుడు విచారించాలన్న అంశంపై సీజేఐ చంద్రచూడ్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్ట్ వెకేషన్ బెంచ్ మంగళవారం వెల్లడించింది. ఈ పిటిషన్‌ను మధ్యంతర బెయిల్‌ను విచారిస్తున్న బెంచ్ ఉన్నప్పుడు గతవారమే ఎందుకు దాఖలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. అయితే, కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అనేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని కేజ్రీవాల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.