రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతను సుప్రీంకోర్టు మొదట తేల్చాలి: ఉద్ధవ్ ఠాక్రే
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు ప్రతి రోజూ విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబై: రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు మొదట తేల్చాలని మహారాష్ట్రకు చెందిన శివసేన వర్గం చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఆ తర్వాతే శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ఎవరికి చెందుతాయన్న దానిపై ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీ పేరుతోపాటు విల్లు-బాణం గుర్తును ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని ప్రశ్నించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూప్ వీటిని వినియోగించడం లేదన్న సంగతిని గుర్తు చేశారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు ప్రతి రోజూ విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, గత ఏడాది జూన్‌లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. ప్రత్యేక విమానంలో అస్సాంలోని గువాహతికి చేరుకుని అక్కడ కొన్ని రోజులు మకాం వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాది (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోయింది. అనంతరం రెబెల్ నేత షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

