Arvind Kejriwal | హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీ రెండు వేర్వేరు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 5న విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేజ్రీకి షరతులతో (conditions) కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Also Read..
Arvind Kejriwal | సత్యమే గెలిచింది.. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై ఆప్ నేతలు హర్షం
YS Jagan | వైఎస్ జగన్‌తో సెల్ఫీ.. మహిళా కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో!