 
                                                            న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తాజాగా ఇద్దరు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరి పూర్తి సామర్ధ్యంతో కొలువుదీరింది. ఈ నెల 11న సీజేఐ నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టు జడ్జీలుగా మణిపూర్‌కు చెందిన ఎన్ కోటీశ్వర్ సింగ్, తమిళనాడుకు చెందిన మహదేవన్‌ల పేర్లను సిఫారసు చేయగా, కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది.
దీంతో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ప్రస్తుతం సింగ్ జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. అలాగే మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు.
 
                            