న్యూఢిల్లీ: జైలు శిక్ష పూర్తిచేసుకున్న తర్వాత కూడా జైల్లో మగ్గుతున్న ఖైదీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అతడు లేదా ఆమె ఏదైనా కేసులో ‘వాంటెడ్’ కానట్టయితే.. జైలు శిక్షా కాలం పూర్తిచేసుకున్న దోషుల్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. మంగళవారం ఇందుకు సంబంధించి రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
2002నాటి నితీశ్ కటారా హత్య కేసుకు సంబంధించి సుఖదేవ్ యాదవ్‌ను జైలు నుంచి విడుదల చేయలని చెప్తూ కోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది.