న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనకు తానుగా విచారణకు స్వీకరించిన కోర్ట్టు దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని, సీబీఐని కోరింది. సైబర్ నేరగాళ్లు అంబాలాలో ఓ వృద్ధ జంటకు నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను పంపి రూ.1.05 కోట్లను లూటీ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
ఇలాంటి ఘటనల వల్ల అమాయకులకు న్యాయ సంస్థలపై ఉన్న విశ్వాసం చెదిరిపోతుందని తెలిపింది.