తిరువనంతపురం: విద్యార్థులు, డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక డాక్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. (Drugs Supplying To Students) కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు, డాక్టర్లకు కొందరు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు జిల్లా యాంటీ-నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్‌కు సమాచారం అందింది.
కాగా, కనియాపురం తోపిల్ ప్రాంతంలోని అద్దె ఇంటిలో డ్రగ్స్ సరఫరాదారులు నివసిస్తున్నట్లు యాంటీ-నార్కోటిక్స్ అధికారులకు తెలిసింది. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టి రైడ్ చేశారు. ఆ ఇంట్లో సోదాలు చేశారు. నాలుగు గ్రాముల ఎండీఎంఏ, గ్రాము హైబ్రిడ్ గంజాయి, వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఏడుగురు నిందితులను అధికారులు గుర్తించారు. డాక్టర్ విఘ్నేష్ దాతన్, డెంటల్ విద్యార్థిని హలీనా, ఐటీ ఉద్యోగి అవినాష్, అసిమ్, అజిత్, అన్సియా, హరీష్‌ను అరెస్ట్ చేశారు. అసిమ్, అజిత్, అన్సియా గతంలో అనేక మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్నారని నిర్ధారించారు.
కాగా, నిందితులకు చెందిన రెండు కార్లు, రెండు బైకులతో పాటు పది మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ బృందాన్ని అడ్డగించే ప్రయత్నం విఫలమైందని పోలీస్ అధికారి తెలిపారు. పోలీస్ వాహనాన్ని కారుతో ఢీకొట్టి నిందితులు పారిపోయినట్లు వెల్లడించారు.
Also Read:
Cigarette and Beedi Costlier | పెరుగనున్న సిగరెట్టు, బీడీ, పాన్ మసాలా ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
Watch: ఇంటి ముందు కూర్చొన్న వృద్ధురాలు.. కోతులు ఏం చేశాయంటే?