Sunita Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. తన భర్తను తీహార్ జైలులో అంతమొందించేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నారని ఆమె ఆదివారం సంచలన వ్యాక్యలు చేశారు. ఆప్ చీఫ్ తీసుకునే భోజనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని పసిగట్టేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారని ఢిల్లీ సీఎం కదలికలను అధికారులు పసిగడుతున్నారని ఆమె ఆరోపించారు.
కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షిస్తున్నారని, ఇది సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. మధుమేహంతో బాధపడుతూ 12 ఏండ్ల నుంచి రోజూ ఇన్సులిన్ తీసుకుంటున్న కేజ్రీవాల్‌కు జైల్లో ఇన్సులిన్‌ను నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ సీఎంను చంపేయాలని వారు కోరుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాంచీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీని ఉద్దేశించి సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు.
ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌లను తప్పు చేశారని తేలకుండానే వారిని జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని తలపిస్తోందని సునీతా కేజ్రీవాల్ విమర్శించారు. తన భర్త చేసిన తప్పేమిటని ఆమె నిలదీశారు.మెరుగైన విద్యా, వైద్య సౌకర్యాలు సమకూర్చడమే ఆయన చేసిన తప్పా అని సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ తన జీవితాన్ని పణంగా పెట్టారని, ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన కేజ్రీవాల్ తలుచుకుంటే విదేశాలకు వెళ్లారని, కానీ ఆయన దేశభక్తికే మొగ్గుచూపారని చెప్పారు.
Read More :
Compex Fixx | దీంతో ఇంటివద్దే బాడీ మసాజ్ చేసుకోవచ్చు..