Compex Fixx | శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఇప్పుడు చాలామంది బాడీ మసాజ్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, ప్రతిసారీ మసాజ్ సెంటర్లకు వెళ్లడం సాధ్యంకాదు. దీనికి సమాధానమే.. ‘కాంపెక్స్ ఫిక్స్ 2.0’. ఇంటి వద్దే ఉండి, ఎవరికివారే మసాజ్ చేసుకునేలా కాంపెక్స్ సంస్థ ఈ మసాజర్ గన్ను తీర్చిదిద్దింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన ఈ మసాజర్ గన్.. ఒక సెకన్‌కు 50 హిట్స్ ఇస్తుంది.
మామూలు మసాజర్లతో పోలిస్తే.. 70శాతం అధికంగా శరీరంపై ఒత్తిడిని కలగజేస్తుంది. వివిధ శరీర భాగాలపై మసాజ్ చేసుకునేందుకు వీలుగా.. ఇందులో ఐదు ప్రత్యేకమైన రబ్బర్ టిప్స్ ఉంటాయి. ఇందులోని ఐదు ‘బిల్ట్ ఇన్ స్పీడ్స్’ ద్వారా మనకు నచ్చినట్టుగా మసాజ్ చేసుకొనే వీలు ఉంటుంది. ఇందులో 16 వోల్ట్స్ లిథియమ్ పాలిమర్ బ్యాటరీని ఏర్పాటుచేశారు. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 90 నిమిషాల వరకూ పనిచేస్తుంది. ఈ మసాజర్ గన్ ధర రూ. 32,300. compex.comతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉన్నది.