Delhi Blast | ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar un Nabi) గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న సమయంలో మహిళా రోగులతో మాట్లాడిన తీరు వెలుగులోకి వచ్చింది. జీఎమ్సీ (Government Medical College)లో పనిచేస్తున్న సమయంలో అక్కడి మహిళా రోగులను నబీ హిజాబ్ (Hijab) గురించి ప్రశ్నించేవాడని అధికారులు గుర్తించారు.
హిజాబ్ ధరించని మహిళలను ‘మీరు హిజాబ్ ఎందుకు ధరించడం లేదు..?’, ‘మీ తల ఎందుకు సరిగ్గా కప్పుకోలేదు’ వంటి ప్రశ్నలు అడిగేవారని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అంతేకాదు, ‘ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు..?’ వంటి ప్రశ్నలు కూడా వేసేవాడని తెలిసింది. మత విశ్వాసాల్లో ఉమర్ కఠినమైన విధానాన్ని ప్రదర్శించేవాడని సమాచారం. అతను కరడుగట్టిన తీవ్రవాది అని, ఇతర మత విశ్వాసాలపై ఇస్లామిక్ ఆధిపత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించేవాడని సదరు వర్గాలు గుర్తించాయి. అతడి ప్రశ్నలపై కొందరు ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో రోగులు జీఎమ్సీ అనంత్‌నాగ్ (GMC Anantnag)కు ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత యాజమాన్యం ఉమర్‌ని విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.
Also Read..
Fidayeen | భారత్‌లో భారీ దాడులకు జైషే ప్లాన్.. ఫిదాయిన్ కోసం ఆన్లైన్లో విరాళాల సేకరణ
Delhi Blast | పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసిన డాక్టర్ ఉమర్.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం