Suicide : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్‌మంతర్ (Jantar Mantar) దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. తన వద్దనున్న తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాము ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు.