న్యూఢిల్లీ: దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నది. 2015 నుంచి 2024 మధ్య మొత్తం 1,15,850 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో 14,488కి చేరింది. ఇది 2023లో నమోదైన 13,892 కేసులతో పోలిస్తే 4.3 శాతం ఎక్కువ అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) బుధవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొన్నది. విద్యాపరమైన ఒత్తిళ్లు, మానసిక సమస్యలు, బలహీనమైన సహాయక వ్యవస్థలు తదితర కారణాల వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2020 : 12,526
2021 : 13,089
2022 : 13,044
2023 : 13,892
2024 : 14,488
మహారాష్ట్ర : 13.2%
ఉత్తరప్రదేశ్ : 10.9%
మధ్యప్రదేశ్ : 10%
తమిళనాడు : 8.9%