పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లో చీపుర్లు.. మధ్యప్రదేశ్లో విద్యార్థుల అవస్థ
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు నరకం అనుభవిస్తున్నారు
- పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లో చీపుర్లు
- టాయ్లెట్లు శుభ్రం చేయాలి..
- తరగతి గదులు ఊడ్చాలి..
- వంట చేసుకోవాలి.. పాత్రలు కడగాలి
భోపాల్, సెప్టెంబర్ 27: డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు నరకం అనుభవిస్తున్నారు. తరగతి గదులను విద్యార్థులే ఊడ్చుకోవాలి.. ఆహారం వాళ్లే వండుకోవాలి.. మరుగుదొడ్లను వాళ్లే శుభ్రం చేసుకోవాలి.. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టిసారించలేకపోతున్నారు.
87,630 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- కొయలారి ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రోజు రొట్టెలు చేసుకోవాల్సి వస్తున్నది. గదులను వారే ఊడ్చుకుంటున్నారు.
- ఛాక్దేవ్పూర్ గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు మరుగుదొడ్లను కడుక్కోవాల్సి వస్తున్నది. తరగతి గదులను వాళ్లే శుభ్రం చేస్తున్నారు.
- సింగ్రౌలిలోని పాఠశాలలో విద్యార్థులు గిన్నెలు కడుక్కోవాల్సి వస్తున్నది.
- మధ్యప్రదేశ్లో ఇప్పటికీ 87,630 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఖార్గోన్ జిల్లాలో కూలిపోయే స్థితిలో ఉన్న పాఠశాలను బాగు చేయించాలని 2018 నుంచి మొత్తుకుంటున్నా ఇప్పటికీ బాగు చేయించలేదు. దీంతో చెట్టుకింద తరగతులు నిర్వహించాల్సి వస్తున్నది.
- 36,498 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేదన్న విషయం స్వయంగా ప్రభుత్వ సర్వేలో తేలింది.
- సరైన భద్రత లేకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడంతో దాదాపు 10,630 మంది విద్యార్థినులు చదువును మానేశారు.
- ఈ దుస్థితిపై ఉపాధ్యాయులను, అధికారులను ప్రశ్నించగా.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని చెప్పారు. సమస్యల ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతున్నదని వాపోతున్నారు. అయితే మధ్యప్రదేశ్లో ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నామని ఇప్పటికీ ప్రభుత్వం డప్పుకొట్టుకోవడం కొసమెరుపు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

