ముంబై : ఇమ్రాన్ ఖాన్, జెనీలియా డిసౌజాల జానే తు యా జానే న మూవీలోని సాంగ్‌ను ముంబై సెంట్ జేవియర్ కాలేజ్ స్టూడెంట్స్ రీక్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 2008లో విడుదలైన ఈ మూవీలోని కభీ కభీ అదితి సాంగ్‌కు కాలేజ్ విద్యార్ధులు ఆడిపాడిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాతో పాటు పాటలు కూడా అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచాయి. సెంట్ జేవియర్స్ కాలేజ్ ఎక్స్ట్రా కరిక్యులర్ కమిటీ ఈ సాంగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒరిజినల్ సాంగ్ కూడా ఇదే క్యాంపస్‌లో షూట్ చేయడం విశేషం. ఒరిజినల్ వీడియో తరహాలోనే ఉండేలా విద్యార్ధులు ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేయడం ఆకట్టుకుంటుంది.
అదే తరహా దుస్తులను ధరించిన విద్యార్ధులు సీన్స్, సీక్వెన్స్ మ్యాచ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించింది. కభి కభి ఆదితి మొమెంట్..మేమంతా అందుకే వేచిచూస్తున్నామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోతో తమను పాతరోజుల్లోకి తీసుకవెళ్లారని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. ఈ వీడియో అద్భుతమని మరికొందరు రాసుకొచ్చారు.
Read More :