న్యూఢిల్లీ : దక్షిణాది రుచులు ముఖ్యంగా దోసె, ఇడ్లీలను (Viral Post) అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా సదరన్ డిష్‌లను తరచూ ఆస్వాదిస్తారు. ఎల్లిస్ తన ఫేవరెట్ ఇండియన్ డిష్ గురించి లేటెస్ట్ ట్వీట్లో ప్రస్తావిస్తూ అందరికీ నోరూరించారు. తాను బెంగళూర్‌కు తిరిగివచ్చానంటూ దోసెను ఎంజాయ్ చేసిన ఫొటోను ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు.
Back in Bengaluru #Dosa 👍🏼
🍴 👎🏼 pic.twitter.com/LMQkKAVw8W— Alex Ellis (@AlexWEllis) February 23, 2023
ఎల్లిస్ గతంలోనూ తాను వడపావ్, దోసె, రసగుల్లా వంటి భారత వంటకాలను ఆరగిస్తూ ఇండియన్ ఫుడ్‌పై తన ఇష్టాన్ని తెలిపే పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈసారి తాను బెంగళూర్‌లో ఆరగించిన క్రిస్పీ దోసె, సాంబార్, కొబ్బరి చట్నీతో కూడిన ఫొటోను షేర్ చేశారు. ఇక బ్యాక్ ఇన్ బెంగళూర్..దోసె అంటూ ఈ పోస్ట్‌కు ఎల్లిస్ క్యాప్షన్‌గా ఇచ్చారు.
ఈ పోస్ట్‌కు నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. ఎల్లిస్ ఇండియన్ ఫుడ్‌ను ఆస్వాదించడాన్ని యూజర్లు స్వాగతించారు. మీరు బ్రిటన్ ఫుడ్‌ను సవాల్ చేస్తున్నారు..సార్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ రుచికరమైన దోసె ఎయిర్పోర్ట్ హోటల్‌దని మరో యూజర్ రాసుకొచ్చారు. బెంగళూర్‌కు మిమ్మల్ని స్వాగతిస్తున్నామని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :