Viral Video | చిరుతను వెంటాడిన పులి..చివరి నిమిషంలో ఏమైందంటే..!
పులి, చిరుత ఎదురెదురుగా తలపడినా అవి అసాధారణ రీతిలో వ్యవహరించిన వీడియో (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఇది అసాధారణ ప్రవర్తన అంటూ రాసుకొచ్చారు.
న్యూఢిల్లీ : పులి, చిరుత ఎదురెదురుగా తలపడినా అవి అసాధారణ రీతిలో వ్యవహరించిన వీడియో (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఇది అసాధారణ ప్రవర్తన అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 28,000కుపైగా వ్యూస్ లభించాయి. పులులు చిరుతలను వెంటాడే క్రమంలో ఈ సన్నివేశం అసాధారణంగా కనిపిస్తుంది.
This face off between the tiger & leopard is bit unnatural.
What do you think as to why both backed up without attacking each other. Peaceful coexistence? pic.twitter.com/O7yTkkFYil— Susanta Nanda IFS (Retd) (@susantananda3) February 22, 2023
వీడియో క్లిప్లో దూరం నుంచి చెట్టుపై ఉన్న చిరుతను పులి గమనిస్తుంటుంది. చిరుత కిందకు దూకగానే పులి దాన్ని వెంబడించడం కనిపిస్తుంది. అయితే రెండూ దగ్గరగా వచ్చినా పరస్పరం తలపడలేదు. రెండూ కొద్దిసేపు ఒకదానివైపు మరొకటి చూసుకోగా ఆపై పులి నడుచుకుంటూ వెళుతుంది.
అయితే చిరుతపై పులి ఎందుకు దాడి చేయలేదనేందుకు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చిరుత తనను తాను కాపాడుకునేందుకు వెనుదిరగడంతోనే పులి వెనక్కితగ్గిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. అనవసరంగా గాయపడటం ఎందుకనే యోచనతో పులి వెనక్కి తగ్గిందని మరికొందరు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. శాంతియుత సహజీవనం కోసమే ఇవి పరస్పర దాడికి పాల్పడలేదా అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :
Stray Dogs | ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు.. కీలక నిర్ణయం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- leopard
- tiger
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

