MP Prajwal Revanna | అశ్లీల వీడియోల రగడ : ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీ(ఎస్) వేటు
అశ్లీల వీడియోల వ్యవహారంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
MP Prajwal Revanna : అశ్లీల వీడియోల వ్యవహారంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై వేటు వేస్తున్నట్టు ఆ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ యువ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అంతకుముందు వెల్లడించారు.
సొంతపార్టీ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించే విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మంగళవారం హుబ్బళ్లిలో జరిగే జేడీఎస్ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కర్నాటకలో తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ వ్యవహరం కన్నడ నాట పెనుదుమారం రేపడంతో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేడీఎస్ నిర్ణయించింది.
Read More :
AP News | విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

