AP News | విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
AP News | విజయవాడలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. డాక్టర్ డి. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకున్నాడు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి విగతజీవులుగా పడి ఉన్నారు.
AP News | విజయవాడ : విజయవాడలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. గురునానక్ నగర్లో నివాసం ఉంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డి. శ్రీనివాస్(40)తో పాటు ఆయన భార్య ఉఫ(38), ఇద్దరు పిల్లలు శైలజ(9), శ్రీహన్(8), తల్లి రమణమ్మ(65) మరణించారు
మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయని, వారి గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఉరేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఇటీవలే శ్రీనివాస్ ఆస్పత్రి పెట్టారు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. అప్పట్నుంచి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయనే కుటుంబాన్ని హతమార్చి ఆపై సూసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

