Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. రెండు రోజుల్లో రెండో ఘటన
Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో మరో విద్యార్థి తనువు చాలించాడు.
Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
అదే రాష్ట్రానికి చెందిన (రాజస్థాన్) భరత్ అనే విద్యార్థి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి సన్నద్ధమవుతున్నాడు. కోటాకు 400 కిలోమీటర్ల దూరంలోని ధోల్పూర్కు చెందిన భరత్.. కోటాలోని ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజా ఘటనతో కలిసి రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది పదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల నీట్ విద్యార్థి కూడా ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షకు (NEET aspirant) సన్నద్ధమవుతున్న సుమిత్.. గత ఏడాది కాలంగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మరోవైపు విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థానం ప్రభుత్వం ఇటీవలే నివారణ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే ఇటీవలే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఆగకపోవడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
Also Read..
Amit Shah | రిజర్వేషన్లను మా పార్టీ ఎప్పటికీ తొలగించదు.. ఫేక్ వీడియోపై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

