జైపూర్: స్కూల్ నుంచి బహిష్కరించినందుకు కక్షగట్టిన ఒక విద్యార్థి టీచర్ను కత్తితో పొడిచి హత్య (Student Murders teacher) చేశాడు. రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల విద్యార్థి స్కూల్లో అల్లరి పనులు చేయడంతోపాటు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. 54 ఏళ్ల టీచర్ శివచరణ్ సైన్ చాలాసార్లు అతడ్ని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే స్కూల్లో చదువుతున్న విద్యార్థినితో అతడి ప్రేమ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ స్టూడెంట్ను స్కూల్ నుంచి బహిష్కరించారు.
కాగా, స్కూల్ బహిష్కరణకు కారణమైన టీచర్ శివచరణ్పై ఆ విద్యార్థి కక్షగట్టాడు. ఆ ఉపాధ్యాయుడ్ని చంపేందుకు పలు రోజులుగా ప్లాన్ చేస్తున్నాడు. మంగళవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న టీచర్ను తన ఇద్దరు స్నేహితులతో కలిసి అడ్డుకున్నాడు. ఆ టీచర్ను కత్తితో పలుమార్లు పొడిచి బైక్పై పారిపోయాడు. దీంతో ఉపాధ్యాయుడు శివచరణ్ రోడ్డుపై కుప్పకూలి మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. టీచర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మైనర్ బాలుడ్ని అరెస్ట్ చేశారు. టీచర్ హత్యకు వినియోగించిన కత్తి, సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, హత్యకు గురైన టీచర్ శివచరణ్ ప్రముఖ కవి, అవార్డు గెలుచుకున్న ఉపాధ్యాయుడని పోలీసులు తెలిపారు.
Also Read: