Bengaluru | మన దేశంలో ట్రాఫిక్ జామ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరమే. స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే. వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరుది దేశంలోనే అగ్రస్థానం. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంటుంది. కిలోమీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.
తాజాగా నగరంలో మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. బుధవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై (Electronic City flyover) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు (walk home). ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6
— KpopStan🤍 (@PratikfamHouse) October 23, 2024
బెంగళూరును ముంచెత్తిన వానలు
భారీ వర్షాలకు (heavy rain) బెంగళూరు అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలు కాలనీలను వరద ముంచెత్తింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. మోకాళ్లలోతు నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల కార్లు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ వర్షాలకు ఇప్పటి వరకూ 5 మంది మరణించినట్లు తెలిసింది. బాబుసాపాళ్యలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరిని అధికారులు రక్షించారు.
Absolute hell with traffic rn. If anyone is planning to start in electronic city NOW, don’t. Took 4 times the normal time. And on 2 wheeler no less.
— Vidhya Bharathi (@Vidya191002) October 23, 2024
Also Read..
Trash balloons | సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్
Justin Trudeau | కెనడా ప్రధాని ట్రూడోకు సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం.. రాజీనామా చేయాలంటూ డెడ్‌లైన్
Cyclone Dana | తీవ్ర తుఫాన్‌గా దానా.. ఒడిశాలోని ఆ రెండు ఆలయాలు మూసివేత