Vande Bharat | గయాలో రెండు వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు.. ఇద్దరు యువకులు అరెస్ట్
Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు (Stones thrown).
Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు (Stones thrown). బీహార్ (Bihar) రాష్ట్రం గయా (Gaya)లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 20894 నంబర్‌గల పాట్నా టాటా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గయా స్టేషన్ నుంచి బయల్దేరింది. మన్పూర్ రైల్వే సెక్షన్ సమీపంలోకి రాగానే ఈ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. అదేవిధంగా 22304 నంబర్ గల గయా-హౌరా వందే భారత్‌పై కూడా రాళ్ల దాడి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న గయా ఆర్పీఎఫ్ ప్రత్యేక బృందం ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించింది.
ఈ ఘటనపై అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్‌సేవక్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 153, 147 రైల్వే యాక్ట్ కింద గయాలో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. దాడికి పాల్పడింది మన్పూర్ వాసులు వికాస్ కుమార్ (20), మనీష్ కుమార్ (20)గా గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. తాము మరిన్ని రైళ్లను కూడా టార్గెట్ చేయబోతున్నట్లు విచారణలో బయటపెట్టారు. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది రైళ్లపై రాళ్ల దాడులను నివారించారు.
Also Read..
Kalpana Soren | వెనుకంజలో జార్ఖండ్ సీఎం భార్య కల్పనా సోరెన్
MLA Megha Reddy | సెక్రటేరియట్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

