Kalpana Soren | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బర్మైత్లో సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) ముందంజలో కొనసాగుతున్నారు. అయితే, గండే అసెంబ్లీ (Gandey assembly) స్థానం నుంచి పోటీచేసిన సీఎం భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) మాత్రం వెనుకంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థిపై 3128 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.
#JharkhandAssemblyElection2024 | Kalpana Soren, wife of Jharkhand CM Hemant Soren & JMM candidate for Gandey assembly trailing by a margin of 3128 votes, after round 1/21 of counting as per latest EC data.
JMM-led Mahagathbandhan has crossed the majority mark in the state as per… pic.twitter.com/EyVTWdgnK1
— ANI (@ANI) November 23, 2024
మరోవైపు జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందలు చేస్తూ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం (JMM) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటాల్సి ఉంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇండియా కూటమి మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటేసింది. ప్రస్తుతం 51 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
Also Read..
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్దే
Maharashtra Elections | ఫలించని కాంగ్రెస్ వ్యూహం.. ‘మహా’ పీఠం మహాయుతిదే