Stock Markets | స్టాక్ మార్కెట్లలో ఎన్నికల ఫలితాల జోష్.. భారీ లాభాల్లో సూచీలు
Stock Markets | నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) ఫలితాలు స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో జోష్ నింపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ పండుగ వాతావరణం కనిపిస్తోంది.
Stock Markets : నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) ఫలితాలు స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో జోష్ నింపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ (Exitpolls) అంచనాలకు తగ్గట్టుగానే ప్రారంభ ట్రెండ్స్‌లో అధికార మార్పు సూచనలు కనిపిస్తుండటం, అన్నిచోట్లా స్పష్టమైన మెజారిటీలు కనబడుతుండటం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. నేడు మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం నుంచే బుల్ రన్ (Bull run) కొనసాగుతోంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ ఏకంగా 745 పాయింట్లు ఎగబాకి 77,656 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 220 పాయింట్లకుపైగా లాభంతో 24,215 పాయింట్లకు పైస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా అనిశ్చితిలో ఉన్న మార్కెట్లు.. నేడు ఫలితాల సరళి స్పష్టంగా ఉండటంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగ షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుండటంతో మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల అనుకూల విధానాలు వస్తాయనే ఆశతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
ముఖ్యంగా రైల్వే, డిఫెన్స్, పవర్ గ్రిడ్ వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం పెరుగుతుందనే అంచనాలు మార్కెట్‌కు బూస్ట్‌ను ఇచ్చాయి. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీయే పట్టు నిలుపుకోవడం కూడా స్థిరత్వానికి చిహ్నంగా మార్కెట్ భావిస్తోంది. మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్‌తో ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు 2 నుంచి 3 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చేలోపు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని, కేవలం రాజకీయ ఫలితాలనే కాకుండా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువను కూడా గమనించాలని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- fmcg
- nifty
- Sensex
- Stock Markets
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

