చెన్నై: తమిళనాడులో డీఎంకే పాలనలో కస్టోడియల్ మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించిన నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ ‘ఖాళీ, పబ్లిసిటీ మోడల్’ డీఎంకే సర్కార్ ఇప్పుడు ‘సారీ మోడల్ సర్కార్’గా మారిందని విమర్శించారు. శివగంగ జిల్లాలో పోలీసుల టార్చర్‌కు కస్టడీలో మృతి చెందిన అజిత్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీవీకే ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఆయన ప్రసంగించారు.
2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 24 మంది పోలీస్ కస్టడీలో మరణించారని, వారందరికీ కూడా స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.