Watch: పాక్షికంగా కుంగిన వేదిక.. రాహుల్ గాంధీకి తప్పిన ముప్పు
Rahul Gandhi | ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని పాలిగంజ్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఇండియా బ్లాక్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేతలు తేజస్వీ యాదవ్, మిసా భారతితో కలిసి రాహుల్ గాంధీ స్టేజ్ పైకి చేరుకున్నారు. అయితే ఆ వేదికపై అప్పటికే ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టేజ్ పాక్షికంగా కూలింది. దీంతో మిసా భారతి చేతులు పట్టుకుని నడిచిన రాహుల్ గాంధీ కొంత బ్యాలెన్స్ కోల్పోయారు. అయితే వెంటనే ఆయన తేరుకున్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. కొద్దిగా కుంగిన వేదిక వద్ద ఉన్న ఆయనకు సహాయం కోసం ముందుకు వచ్చారు. స్టేజ్ నుంచి దిగిపోవాలని రాహుల్‌కు సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. అనంతరం అదే వేదికపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధాని మోదీపై మండిపడ్డారు. అయితే పాక్షికంగా కుంగిన వేదిక వద్ద రాహుల్ గాంధీ అదుపుతప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Overcrowding at the stage of Congress leader Rahul Gandhi and RJD leader Tejashwi Yadav in Paliaganj area of Bihar.
All leaders safe. pic.twitter.com/8U0Th5jPCL
— Anand Singh (@Anand_Journ) May 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

