ముంబై: టర్నింగ్ తీసుకుంటున్న ఆటో బైక్ను ఢీకొట్టింది. బైక్పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్లో ఉండటంతో నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో (Kolhapur Crash) ఈ సంఘటన జరిగింది. షాహుపురిలోని పాట్కీ ఆసుపత్రి సమీపంలో ఒక ఆటో యూ టర్న్ తీసుకున్నది. అయితే వేగంగా వచ్చిన బైక్ను ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పడ్డారు.
కాగా, టర్న్ తీసుకుంటూ బైక్ను ఢీకొట్టిన ధాటికి ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్లో ఉండటంతో రోడ్డుపై రౌండు కొట్టింది. నడిచి వెళ్తున్న వారి మీదకు ఆటో దూసుకెళ్లింది. చివరకు రోడ్డు పక్కగా ఉన్న ద్విచక్ర వాహనాలు అడ్డుగా ఉండటంతో ఆ ఆటోను కంట్రోల్ చేశారు.
మరోవైపు ఈ సంఘటనలో మహిళలతో సహా ఐదుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో డ్రైవర్ లేని ఆటోను దెయ్యం నడిపిందని, డ్రైవర్ లెస్ ఆటో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
🇺🇲: Driverless Cars
🇮🇳: Driverless Safest Autorickshaws without doors and seatbeltsVideo from Kolhapur.
— Roads of Mumbai (@RoadsOfMumbai) June 16, 2024