Chenab Rail Bridge | న్యూఢిల్లీ, జూన్ 16: జమ్ము-కశ్మీర్‌కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైలు ఇంజన్‌ను నడిపి తొలి ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.
కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉధంపూర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగానే నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ బ్రిడ్జి రికార్డును ఇది అధిగమించింది.