ముంబై: స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. (SpiceJet passengers angry over food) ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండు వారాల కిందట మహారాష్ట్రలోని పూణె నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ నేపథ్యంలో పూణె ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు.
కాగా, తమకు అందించిన ఫుడ్ క్వాలిటీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడైన ఆహారం ఇచ్చారని మండిపడ్డారు. దీనిని జంతువులు కూడా తినబోవని విమర్శించారు. ఆ ఫుడ్‌ను తినాలని స్పైస్ జెట్ సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై స్పైస్ జెట్ స్పందించింది. తాజా ఆహారాన్ని ప్రయాణికులకు అందించినట్లు తెలిపింది. ఈ ఫుడ్‌ను సరఫరా చేసే సంస్థ ఇతర ఎయిర్‌లైన్స్‌తో పాటు టెర్మినల్‌లోని కస్టమర్లకు కూడా అందిస్తుందని చెప్పింది. స్పైస్‌జెట్ ఉద్యోగిని చుట్టుముట్టిన ఈ సంఘటన దురదృష్టకరమని తెలిపింది. తమ సిబ్బంది పట్ల ప్రయాణికుల ప్రవర్తనను ఖండిస్తున్నట్లు పేర్కొంది.
Flight Delayed by 7 Hours, Passengers Serve Stale Food Back to Airline Manager pic.twitter.com/jwhppHBkol
— Woke Eminent (@WokePandemic) June 15, 2025
270 saplings planted | విమాన ప్రమాద మృతులకు నివాళిగా.. 270 మొక్కలు నాటారు
Job Scam | తల్లి మరణించినట్లు నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు.. మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కామ్