Spicejet | ముంబై : ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే టెక్నిషీయన్లు ఆ డోర్‌ను తెరిచారు. దీంతో సదరు ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనపై స్పైస్‌జెట్ విమానాయన సంస్థ ప్రకటన విడుదల చేసింది టాయిలెట్ డోర్ లాక్ కావడం పట్ల విచారం వ్యక్తం చేసింది. బాధిత ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుడికి చికిత్స అందించారు. ఈ ఘటన జనవరి 16న చోటు చేసుకున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది.