లక్నో: వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. అందులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు 30 మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. (bus overturns in Jhansi) మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఒక బస్సు వెళ్తున్నది. సోమవారం ఝాన్సీలోని బాబినా ప్రాంతంలోని జాతీయ రహదారి 44లో ఆ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బీహెచ్ఈఎల్ అవుట్‌పోస్ట్ సమీపంలో రోడ్డు పక్కనున్న పొలాల్లోకి అది దూసుకెళ్లి బోల్తాపడింది.
కాగా, ఆ బస్సులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. సుమారు 30 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బస్సు నుంచి బయటపడిన ప్రయాణికులు సహాయం కోసం కేకలు వేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
◆झांसी-तेज रफ्तार अनियंत्रित बस खेत में घुसी, बस में सवार 30 से अधिक यात्री घायल
◆टीकमगढ़ से झांसी आ रही थी बस, पुलिस और एम्बुलेंस टीम मौके पर पहुंची
◆घायलों को अस्पताल में भर्ती कराया गया, बबीना क्षेत्र के भेल चौकीक्षेत्र का मामला#Jhansi @jhansipolice @Uppolice pic.twitter.com/FmhupxuG6f
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 3, 2025
Also Read:
BJP leader missing | బీజేపీ నేత అదృశ్యం.. అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం ఆరోపణ
Woman Pushed Of Moving Train | కదులుతున్న రైలు నుంచి.. మహిళను బయటకు తోసిన ప్రయాణికుడు
Girl Gang-Raped | ట్యూషన్ కోసం వెళ్లిన బాలికపై.. ముగ్గురు సామూహిక అత్యాచారం
Watch: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో చంపిన పనిమనిషి.. వీడియో వైరల్